ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో వివిధ కారణాలతో పలువురు మృతి

ABN, Publish Date - May 19 , 2025 | 11:50 PM

జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో పలువురు మృతిచెందారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో పలువురు మృతిచెందారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

సరుబుజ్జిలి, మే 19(ఆంధ్రజ్యోతి): మండలం లోని కూన జమ్మన్నపేట గ్రామానికి చెందిన హనుమంతు వెంకటి (60) అనే రోజు కూలి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు కుటుం బ సభ్యులు తెలిపారు. ఆ వివరాలు ఇలా.. ఎప్పటిలాగే ఆదివారం రోజువారీ కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి రాలేదు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో సరుబుజ్జిలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కూన జమ్మన్నపేట గ్రామాల మధ్య వెంకటి రోడ్డు పక్కన పడి ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమా చారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకొని 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ప్రమాదవశాత్తూ తన భర్త ప్రాణాలు కోల్పోయి రోడ్డు పక్కన పడి ఉన్నా రనే అనుమానంతో భార్య నారాయణ మ్మ సరు బుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. రిమ్స్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కొంగరాంలో తాపీమేస్త్రి..

ఎచ్చెర్ల, మే 19(ఆంధ్రజ్యోతి): కొంగరాం గ్రా మానికి చెందిన తాపీమేస్త్రి సూరపు శ్రీనివాస రావు(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొన్నాడ బ్రిడ్జి రోడ్‌లో సోమవారం ఉదయం ఓ మెకానిక్‌ షెడ్‌కు సమీపంలోని పొలాల్లో శ్రీని వాసరావు మృత దేహాన్ని గుర్తించారు. మద్యం అలవాటు ఉన్న ఈయన ఆదివారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. శ్రీనివాసరావుకు గార మండలం అయ్యవారిపేట గ్రామానికి చెందిన హైమావతితో కొన్నేళ్ల కిందట వివాహ మైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా, పెద్ద కుమార్తెకు ఇటీవల వివా హం జరిగింది. మద్యం సేవించి నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె రెండు నెలల కిందట కన్నవారింటికి వెళ్లి పోయింది. దీంతో నిత్యం మద్యం తాగుతూ శ్రీనివాసరావు ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌, క్లూస్‌ టీమ్‌ సందర్శించి వివరాలు సేకరించారు. భార్య హైమా వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి..

పలాస, మే 19(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 5వ వార్డు తాళభద్ర గ్రామ సమీ పంలో సోమవారం గుర్తు తెలి యని మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాళ భద్ర-అక్కుపల్లి రోడ్డులో నీలం రంగు జీన్‌ ఫ్యాంట్‌, మెరూ న్‌ కలర్‌ షర్టు ధరించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వీఆర్వో ఎర్ర య్యకు సమాచారం అందించగా, ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి ..

రణస్థలం, మే 19(ఆంధ్రజ్యోతి): ముక్తుంపురం గ్రామానికి చెందిన బోనెల ఈశ్వరరావు(43) కేజీ హెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌ చిరంజీవి చెప్పి న వివరాల మేరకు.. ఈనెల 16వ తేదీన ఈశ్వ రరావు ప్రమాదవశాత్తు మేడపై నుంచి పడిపో వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజేహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎచ్చెర్లకి చెందిన మహిళ..

ఎచ్చెర్ల, మే 19(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల గ్రామా నికి చెందిన నేతింటి రాజులమ్మ (55) ఈనెల 17న పాముకాటుకు గురై శ్రీకాకుళం సర్వజనా సుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈమె తన భర్త అప్పలసూరితో కలిసి ఈ నెల 17న (శనివారం) పొలంలో గడ్డి కోయ డానికి వెళ్లగా.. పాముకాటుకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమె ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందింది. ఈమెకు నలుగురు కుమారులు కాగా, ఇందులో ఒక కుమారుడు నేతింటి రాజారావు స్థానిక టీడీపీ నాయకుడిగా ఉన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:50 PM