మాన్యువల్ బదిలీలు చేపట్టాలి
ABN, Publish Date - May 13 , 2025 | 12:03 AM
:ఎస్టీజీలకు మాన్యువల్ బదిలీలు చేపట్టాలని, మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 75కి మించితే, టీఎస్ హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్‌కుమార్ కోరారు.
పాత శ్రీకాకుళం, మే12(ఆంధ్రజ్యోతి):ఎస్టీజీలకు మాన్యువల్ బదిలీలు చేపట్టాలని, మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 75కి మించితే, టీఎస్ హెచ్‌ఎం పోస్టు అదనంగా కేటాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్‌కుమార్ కోరారు. సోమవా రం శ్రీకాకుళంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట పాఠశాలల పునర్వవస్థీకరణ, బదిలీలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబం ధించిన సమస్యలపరిష్కారానికి యూటీఎఫ్‌జిల్లా శాఖ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా కిషోర్‌కుమార్ మాట్లా డుతూ జీవో-117ను రద్దుచేసి, దాని స్థానంలో కొత్తజీవోను తీసుకు రావాలని, కొత్త జీవో ప్రకారమే పాఠశాలల పునర్వవస్థీకరణ చేప ట్టాలని డిమాండ్‌చేశారు.సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని, బదిలీలకు ముందే ప్లస్ టూ హైస్కూల్లో ఇంటర్ బోధనకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 15న డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జడ్పీ సమావేశ మం దిరంలో కలెక్టర్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్ర మంలో వైకుంఠరావు, బి.రవికుమార్, కె.రమేష్‌కుమార్, జి.నారాయ ణరావు, వాసుదేవరావు, కోదండరావు, మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 12:03 AM