ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

crime news: అల్లుడే కడతేర్చాడు

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:19 PM

Family dispute Uncle murdered ఇంటికి పెద్దకొడుకు మాదిరి అండగా నిలవా ల్సిన అల్లుడు.. క్షణికావేశంలో మామను కడ తేర్చాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మామ-అల్లుడు మ ధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మం గళవారం బైక్‌ విషయమై ఆ ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ.. హత్యకు దారితీసింది.

గంగయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో గంగయ్య (ఫైల్‌)
  • క్షణికావేశంలో మామను హతమార్చిన వైనం

  • మద్యానికి బానిసై.. తరచూ గొడవలు

  • బైక్‌ విషయమై ఘర్షణపడి.. కత్తితో పొడిచి..

  • ఇచ్ఛాపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఇంటికి పెద్దకొడుకు మాదిరి అండగా నిలవా ల్సిన అల్లుడు.. క్షణికావేశంలో మామను కడ తేర్చాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మామ-అల్లుడు మ ధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మం గళవారం బైక్‌ విషయమై ఆ ఇద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ.. హత్యకు దారితీసింది. ఇం దుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలం మండపల్లికి చెందిన బర్రి గంగయ్య(59).. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన పెద్దల్లుడు పాతిర్ల దశరథరెడ్డి అలియాస్‌ దాస్‌ చేతిలో హత్యకు గురయ్యాడు. కొద్దిరోజులుగా మామ-అల్లుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంగయ్య గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టేందుకు మంగళవారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్నాడు. గ్రామ సచివాలయం సమీపంలో మాటుకాసిన అల్లుడు దశరథరెడ్డ్డి మామ సైకిల్‌ను ఆపాడు. తన వద్ద ఉన్న కత్తితో మూడుసార్లు కడుపులో పొడవగా.. గంగయ్య కుప్పకూలిపోయాడు. వెంటనే నిందితుడు పరారయ్యాడు. స్ధానికులు గంగయ్యను హుటాహుటిన ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో భార్య జానకమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు భోరున విలపించారు.

  • గంగయ్య వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద కుమార్తె డిల్లమ్మకు అదే గ్రామంలో దూరపు బంధువైన దశరథరెడ్డితో ఐదేళ్ల కిందట వివాహం చేశారు. జీవనరెడ్డి మద్యానికి బానిసై తరచూ గొడవ పడి భార్యను వేధించేవాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉంది. భర్త వేధింపులు భరించలేక.. పిల్లలతో కలిసి డిల్లమ్మ తల్లిదండ్రుల వద్దే ఆరు నెలల నుంచి ఉంటోంది. కాగా.. గతంలో బైక్‌ కావాలని దశరథరెడ్డి గొడవ చేసేవాడు. దీంతో డ్వాక్రా రుణం తీసుకుని.. ఫైనాన్స్‌ విధానంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. లోన్‌ సక్రమంగా కట్టకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా దశరథరెడ్డి విచ్చలవిడిగా తిరుగుతుండడంతో మామా అల్లుడు, కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఆ బైక్‌ను గంగయ్య తన ఇంటికి తీసుకెళ్లిపోవడంతో దశరథరెడ్డి మరింత కోపాన్ని పెంచుకున్నాడు. ఈ విషయమై మంగళవారం మళ్లీ గొడవ జరగ్గా.. పెద్దల వద్ద పంచాయితీ పెట్టేందుకు గంగయ్య సన్నద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆయనను దశరథరెడ్డి హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడు కోసం గాలిస్తున్నామన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:19 PM