బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:06 AM
: బారువలో 19, 20 తేదీల్లో నిర్వహించే బీచ్‌ఫెస్టివల్ కర్టన్‌రైజర్‌ను విజయ వంతం చేయాలని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు.
సోంపేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బారువలో 19, 20 తేదీల్లో నిర్వహించే బీచ్‌ఫెస్టివల్ కర్టన్‌రైజర్‌ను విజయ వంతం చేయాలని ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు. ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌కు దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. బారువ రిసార్ట్‌లో ఎన్‌డీఏ కార్యకర్తలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారీ ఎత్తున బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఈ కార్యక్రమం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సమావేవంలో ఆర్డీవో వెంకటేశ్వరరావు, సీఐ మంగ రాజు, ఎన్‌డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏర్పాట్లు పరిశీలన
బారువలో శనివారం నుంచి నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం కేంద్ర, రాష్ట్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు తాబేళ్ల పిల్లలను సముద్రంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 12:06 AM