అదుపు తప్పి.. టైర్ల కిందకు దూసుకుపోయి
ABN, Publish Date - May 17 , 2025 | 12:00 AM
:మండలంలోని జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేట వద్ద అంతర్రాష్ట్ర జాతీయరహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో యువ కుడు మినీ వ్యాన్ టైర్ల కిందికి దూసుకుపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలుకావడంతో అక్కడక్కడే మృతిచెందాడు.
నరసన్నపేట, మే16(ఆంధ్రజ్యోతి):మండలంలోని జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేట వద్ద అంతర్రాష్ట్ర జాతీయరహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో యువ కుడు మినీ వ్యాన్ టైర్ల కిందికి దూసుకుపోయాడు. దీంతో తలకు బలమైన గాయాలుకావడంతో అక్కడక్కడే మృతిచెందాడు.స్థానికులు,పోలీసుల కథనం మేరకు..నరసన్నపేట మం డలంలోని జమ్ములో బంధువుల ఇంటి నుంచి సారవకోట మండలంలోని బురద కొత్తూరుకు చెందిన కరజాన సమీర్ (22) ద్విచక్రవాహనంపై హిరమండలం మండలంలోని కలట గ్రామం వెళ్తున్నాడు. గడ్డెయ్యపేట వద్ద మరో ద్విచక్రవాహనం క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ ద్విచక్రవాహనం ముందుభాగానికి సమీర్ ద్విచక్రవాహనం హ్యాండిల్ తగలడంతో అదుపుతప్పింది. దీంతో సమీర్ రోడ్డుపై పడి అక్కడ పార్క్‌చేసిన మినీ వ్యాన్ వెనుక టైర్ల కిందకు చేరాడు. దీంతో తలకు బలమైన గాయాలుకావడంతో అక్కడక్కడే మృతిచెందాడు. సమీర్ నడిపే ద్విచక్రవాహనం 300 మీటర్ల దూరం వరకు ముందుకు దూసుకువెళ్లింది. దీంతో మరో ద్విచక్రవాహనం నడుపుతున్న చౌదరికి గాయాలు కావడంతో స్ధానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.సమీర్ పొందూరులో ఓ శుభకార్యాక్రమానికి హాజరై జమ్ము తన మేనమామ ప్రశాంత్ ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఈప్రమాదం జరిగింది. కుమారుడు మృతిచెందడంతో తండ్రి శ్రీనివాసరావు, తల్లి బుజ్జమ్మ, అక్క స్వర్ణలత, తమ్ముడు శ్యామలరావు లబోదిబోమని రోదిస్తున్నారు. సమీర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదుచేశారు. ద్విచక్రవాహనం సమీర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Updated Date - May 17 , 2025 | 12:00 AM