ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sports Drama: ఆడలేదు కానీ.. మింగేశారు!

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:50 PM

Adudam Andhra Fund misuse ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాపోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. వైసీపీ హయాంలో 2023 డిసెంబరు 15న క్రీడా పోటీలు ప్రారంభం కాగా.. సుమారు 51 రోజులపాటు సాగాయి. ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ తదితర పోటీలు నిర్వహించారు.

‘ఆడుదాం-ఆంధ్రా’లో భాగంగా కబడ్డీ ఆడుతున్న బాలికలు(ఫైల్‌)
  • వైసీపీ హయాంలో ఆటల పేరిట దోపిడీ

  • క్రీడాపోటీల నిర్వహణకే రూ.86లక్షలంట!

  • క్షేత్రస్థాయిలో భారీగా అవినీతి, అక్రమాలు

  • జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్‌ విచారణ

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాశాఖకు సంబంధం లేకుండానే పోటీల నిర్వహణ పూర్తయింది. కేవలం ఆటల పోటీలకే క్రీడాశాఖ పీడీలు పరిమితమయ్యారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు అన్నీ చూశారు. కానీ పీడీలకు సంబంధించి కనీస పారితోషికం అందించలేదు. కొన్నిచోట్ల క్రీడాకారులకు భోజనాలు కూడా పెట్టలేదు. కానీ నిధులు డ్రా చేసుకున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్రస్థాయి ఏజెన్సీల నుంచి స్పోర్ట్స్‌ కిట్లలోనూ ఎక్కువగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించడంతో అక్రమార్కుల్లో గుబులు రేగుతోంది.

  • రణస్థలం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడాపోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. వైసీపీ హయాంలో 2023 డిసెంబరు 15న క్రీడా పోటీలు ప్రారంభం కాగా.. సుమారు 51 రోజులపాటు సాగాయి. ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ తదితర పోటీలు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రఽథమ విజేతకు రూ.20వేలు, ద్వితీయ విజేతకు రూ.10వేలు చొప్పున అందించారు. ఐదు క్రీడాంశాలకు సంబంధించి రూ.1.50లక్షలు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రథమ విజేతకు రూ.50వేలు, ద్వితీయ విజేతకు రూ.30వేలు అందించారు. క్రీడాపోటీల నిర్వహణకు రూ.50లక్షలు, క్రీడాకారుల వసతి, భోజన ఖర్చులకు రూ.22లక్షలు, ఇతరత్రా ఖర్చులకు రూ.14లక్షలు మొత్తంగా రూ.86లక్షలు ఖర్చు చేసినట్టు చూపించారు. కానీ క్షేత్రస్థాయిలో భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. 16 అంశాలకు సంబంధించి జిల్లా క్రీడాశాఖ నుంచి విజిలెన్స్‌ అధికారులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పట్లో అక్రమాలకు పాల్పడినవారిలో అలజడి రేగుతోంది.

  • బలవంతంగా పేర్లు చేర్పులు..

  • ఒక్కో సచివాలయ పరిధిలో 228 మంది చొప్పున క్రీడాకారులు ‘ఆడుదాం-ఆంధ్రా’లో పాల్గొనేలా లక్ష్యం విధించారు. జిల్లావ్యాప్తంగా 732 సచివాలయాలు ఉండగా.. 1,66,896 మంది క్రీడాకారులు హాజరైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ అప్పట్లో వైసీపీ సానుభూతిపరుల కుటుంబసభ్యులు, వలంటీర్ల పేర్లతో నింపేశారు. కొంతమంది హాజరుకాకపోయినా వారి పేర్లను సైతం జతచేర్చి మమ అనిపించేశారన్న ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మునిసిపాల్టీలు, సోంపేట, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, ఎచ్చెర్ల, రణస్థలం వంటి చోట్ల మాత్రమే క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తూతూమంత్రంగా పోటీలు పూర్తిచేశారన్న విమర్శలున్నాయి. అప్పట్లో ప్రచార ఆర్భాటమే తప్ప చిత్తశుద్ధి కరువైందని క్రీడాకారులు, క్రీడాసంఘ ప్రతినిధులు బాహటంగానే వ్యాఖ్యానించారు. కేవలం ఐదే క్రీడాంశాలు ఉండగా.. రిజిస్ర్టేషన్లు మాత్రం ఒక్కో ఆటకు వందల్లో చూపించారు. అసలు ఆడడం వచ్చా? రాదా? అన్నది తెలుసుకోకుండా బలవంతంగా పేర్లు రిజిస్ర్టేషన్లు చేసి.. దోపిడీకి తెర తీశారమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించాల్సిన క్రీడాపోటీలకు వలంటీర్లు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించడం గమనార్హం. ఐదు క్రీడాంశాలకు సంబంధించి పురుషులు, మహిళలను రెండు టీములు చొప్పున ఎంపిక చేశారు. క్రికెట్‌కు సంబంధించి రెండు బ్యాటులు, ఆరు బాళ్లు, ఆరు స్టంపులు, ఇతర గేములకు బాళ్లు, నెట్‌లు అందించారు. కానీ పోటీలు జరుగుతున్నప్పుడే అవి పాడయ్యాయి. నాసిరకం వస్తువులు అందించారన్న విమర్శలున్నాయి. జిల్లావ్యాప్తంగా వీటన్నింటిపైనా విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

  • గౌరవ వేతనాలు ఇవ్వలేదు

    విజిలెన్స్‌ విచారణ వాస్తవమే. మమ్మల్ని కూడా అధికారులు విచారించారు. అప్పట్లో క్రీడాపోటీల గురించి ఆరాతీశారు. ఎంపీడీవోలు ఈ క్రీడాపోటీల బాధ్యతలు నిర్వహించారు. కేవలం పోటీల నిర్వహణ వరకే మేము చూశాం. క్రీడాకారులతోపాటు మాకు భోజన, వసతి ఏర్పాట్లు స్థానిక వీఆర్వో చేశారు. క్రీడల నిర్వహణకుగాను మాకు గౌరవ వేతనాలు ఇస్తామని చెప్పారు. కానీ అందించలేదు.

    - కె.పద్మనాభంరెడ్డి, ఇచ్ఛాపురం పీడీ

  • మాకు సంబంధం లేదు..

    అప్పట్లో క్రీడాపోటీలు నిర్వహించాం. కానీ మాకు ఎటువంటి రిఫరీకి సంబంధించి టీషర్టు కూడా అందించలేదు. గౌరవ వేతనం కూడా ఇవ్వలేదు. ఇటీవల విజిలెన్స్‌ అధికారులు అడిగితే ఇదే విషయం చెప్పాం. కేవలం ఆడించడం వరకే చేశాం. మిగతాదంతా మండల అధికారులే చూసుకున్నారు. చివరకు క్రీడా పోటీలకు సంబంధించి డ్రా లిస్టులు కూడా వారే ఇచ్చారు. మిగతా వాటితో మాకు అసలు సంబంధం లేదు.

    - ఎం.వి.రమణ, పీఈటీ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం

  • వివరాలు అందించాం

    ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలకు సంబంధించి అప్పట్లో జిల్లాకు రూ.86లక్షలు మంజూరయ్యాయి. ఇందులో విజేతల బహుమతులు, నగదు పురస్కారాలకు రూ.50లక్షలు అందించాం. భోజన, వసతికి రూ.22లక్షలు, ఇరత్రా ఖర్చులకు రూ.14లక్షలు ఖర్చయ్యాయి. ఆన్‌లైన్‌లో ఉన్న డేటాతోపాటు అందుబాటులో ఉన్న వివరాలను వారికి అందించాం.

    - శ్రీధర్‌, డీఎస్‌డీవో, శ్రీకాకుళం

Updated Date - Jun 20 , 2025 | 11:50 PM