ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీడికి గిట్టుబాటు ధర కల్పించాలి

ABN, Publish Date - May 21 , 2025 | 11:58 PM

జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16వేలు ధర కల్పించి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని ఏపీ రైతు సం ఘం జిల్లా కార్యదర్శి మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ అజయ్‌కుమార్‌ కోరారు.

మాట్లాడుతున్న ప్రజాసంఘాల నాయకులు

కాశీబుగ్గ, మే 21 (ఆంధ్రజ్యోతి): జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16వేలు ధర కల్పించి రైతు సేవా కేంద్రాల ద్వారా కొను గోలు చేయాలని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని ఏపీ రైతు సం ఘం జిల్లా కార్యదర్శి మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ అజయ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక సీఐ టీయూ కార్యాలయంలో జీడి రైతులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీడికి గిట్టుబాటు ధర, జీడి కార్పొరేషన్‌ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలన్నారు. జీడి సమస్యల పరిష్కారం కోసం ఈనెల చివరి వారం నుంచి దశల వారీ పోరా టానికి రైతు లను సన్నద్ధం చేస్తున్నామన్నారు. సమావేశం లో లక్ష్మీనారాయణ, రాజు, తారకేశ్వరరావు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:58 PM