ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

achieve goals అలసత్వం వీడి లక్ష్యాలను సాధించండి

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:37 AM

achieve goals అలసత్వం విడనాడి లక్ష్యాలను సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ స్పష్టం చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

టెక్కలి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): గురువారం ఓ కల్యాణ మండపంలో జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఏ రకం ఫిర్యాదైనా నిర్ణీత గడు వులోగా సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు అమరావతిలో జరగనుం దని, అప్పటికి అన్ని రకాల ఫిర్యాదులు జీరో స్థాయికి చేరాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. జిల్లాలో 40వేల వరకు అర్జీలు రాగా, మరో ఐదు వేల వరకు పిటిషన్లు పరిష్కారానికి ఉన్నాయని, రానున్న మూడు, నాలుగు రోజుల్లో వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలన్నారు. అరీ ్జదారు సంతృప్తిపడేలా పరిష్కారానికి కృషి చే యాల్సి ఉందన్నారు. మండలానికి ఓ గ్రామం పైలెట్‌ ప్రాజె క్ట్‌గా గతంలో తీసుకున్నామని, అయితే కొన్ని తప్పిదాలు జరిగాయని, ఈసారి పునరా వృతం కాకూడదన్నారు. రెండోవిడత ప్రతి మండలానికి రెండు గ్రామా లను ఎంపిక చేస రీసర్వే చేసి అన్నిరకాల అర్జీలను పరిష్కరిం చాలని సూచించారు. పోర్టు వివాదాల పరి ష్కారం, గ్రామసభల అర్జీలపై చొరవ చూపా లన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం వరకు జరిగిన ఈ సదస్సులో జిల్లా మొత్తం రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజర వడంతో హాలు చాలక కొందరు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వ రరావు, ఆర్డీవోలు ఎం.కృష్ణమూర్తి, గ్రంథి వెంక టేష్‌, సాయిప్రత్యూష, ఎస్‌డీసీ పద్మావతి, సర్వే ఏడీ కుప్పుస్వామి, తహసీల్దార్లు, పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:37 AM