స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల తొలగింపు సరికాదు
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:11 AM
ఎటువంటి నోటీసులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 3,500 మంది కార్మికులను తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ఎటువంటి నోటీసులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 3,500 మంది కార్మికులను తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అఖిల పక్ష కార్మిక సంఘాలు సో మవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి 5,400 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని విమర్శిం చారు. నాయకులు గోవర్థనరావు, తూతిక ప్రవీణ, ఎ.సత్యనారాయణ, ఎల్.రామప్పడు, పి.సుధాకర్‌బాబు, పి.జగ్గారావు, పి.జనార్దనరావు, కేవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 12:11 AM