ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధితులకు సత్వరం న్యాయం అందించాలి: ఎస్పీ

ABN, Publish Date - Jul 28 , 2025 | 11:47 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో బాధితులకు సత్వరమే న్యాయం అందించా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో బాధితులకు సత్వరమే న్యాయం అందించా లని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇచ్చిన 52 మంది నుంచి వినతులు స్వీక రించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులతో మాట్లాడి త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం అందించాలన్నారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ఇచ్ఛాపురం, జూలై28(ఆంధ్రజ్యోతి): గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కేదారి పురం గ్రామంలో స్థానికులతో సమావేశం నిర్వహించి మాద క ద్రవ్యాలు, సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించారు. అలాగే ముచ్చింద్ర గ్రామం వద్ద ఒడిశా నుం చి ఆంధ్రాలోకి వస్తున్న ప్రతీ వాహనాన్ని తనిఖీ చేపట్టారు. హెల్మెట్‌ లేకుండా వచ్చిన వారికి, బైక్‌ పత్రాలు లేని వారిని పట్టుకొని హెచ్చరించారు.

Updated Date - Jul 28 , 2025 | 11:47 PM