ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

న్యాయాధికారులను నియమించాలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 12:14 AM

జిల్లా కోర్టు సముదాయంలోని పలు జూనియర్‌ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకం చేపట్టాలని శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న న్యాయవాదులు
  • హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుబ్బారెడ్డిని కలిసిన శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టు సముదాయంలోని పలు జూనియర్‌ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకం చేపట్టాలని శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. ఈమేరకు ఆదివారం ఆంధ్రపదేశ్‌ హైకోర్టు జడ్జి, శ్రీకాకుళం జిల్లా పోర్టుపోలియో న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డిని ఆదివారం జిల్లా బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కలిశారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్స్‌షాపులో పాల్గొ నేందుకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తిని స్థానిక హోటల్‌లో జిల్లా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు తంగి శివప్రసాద్‌, ప్రధానకార్యదర్శి పిట్టా దామోదర్‌, ఉపాధ్య క్షుడు ఇప్పిలి సీతరాజు, అసోసియేషన్‌ ప్రతినిధులు బీఎస్‌ చలం, న్యాయవాదులు ఎన్ని సూర్యారావు, వాన కృష్ణచంద్‌, మామిడి క్రాంతి, కిలారి ఈశ్వరరావు, ఆఫీసునాయుడు తదితరులు ఉన్నారు.

ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి

అరసవల్లి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధా న అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకు లు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను, ప్రసాదాన్ని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ అందజేశారు.

కూర్మనాఽథుని సన్నిధిలో..

గార, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామి వారిని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చే యగా.. వేదపండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి ప్రసా దాన్ని, చిత్ర పటాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సీతారామ నరసిం హాచార్యులు అందజేశారు.

Updated Date - Jun 23 , 2025 | 12:14 AM