ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు: ఎమ్మెల్యే కూన

ABN, Publish Date - Jun 02 , 2025 | 12:05 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రతి ఉద్యోగ భర్తీల్లో క్రీడాకారులకు ప్రత్యేక కేటాయింపులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ తెలిపారు.

విజేత జట్టుకు ట్రోఫీ అందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ప్రతి ఉద్యోగ భర్తీల్లో క్రీడాకారులకు ప్రత్యేక కేటాయింపులు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరిగిన చిరంజీవి మెమోరియల్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎమ్మెల్యే క్రికెట్‌ కప్‌ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత నెల రోజులుగా సీనియర్‌ క్రీడాకారులు రాష్ట్ర టీడీపీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన ఫైనల్‌ మ్యాచ్‌లో టెక్కలి జట్టుపై నరసన్నపేట విజయం సాధించి ఎమ్మె ల్యే కప్పు విజేతగా నిలిచింది. విజేతలకు ఎమ్మెల్యే రవికుమార్‌, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ చైర్మన్‌, ఇలియాస్‌ కార్యదర్శి హాసన్‌రాజు, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత చేతుల మీదుగా విజేత జట్టు నరసన్నపేటకు రూ.30 వేలు నగదుతో పాటు ట్రోఫీ అందించారు. అలాగే రన్నర్‌ జట్టు టెక్కలికి రూ.20 వేలు నగదుతో పాటు ట్రోఫీ అందించి ఇరుజట్లకు చెందిన 30 మంది క్రీడాకారులకు వ్యక్తిగత బహుమతులు అందించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బోర గోవిందరావు, నూకరాజు, తంగి గురయ్య, రెడ్డి గౌరి, నాగళ్ల మురళీధర్‌ యాదవ్‌, పైడి అయ్యప్ప పరమేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:05 AM