జాబ్‌చార్ట్ అమలుచేయాలి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:55 PM
పదోన్నతులు కల్పించాలని, జాబ్‌చార్ట్ అమలు చేయాలని గ్రామ సచివాలయాల ఉద్యోగులు కోరారు.
నందిగాం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): పదోన్నతులు కల్పించాలని, జాబ్‌చార్ట్ అమలు చేయాలని గ్రామ సచివాలయాల ఉద్యోగులు కోరారు.ఈ మేరకు గురువారం నందిగాం తహసీల్దార్ పి.సోమేశ్వరరావు, ఎంపీడీవో కుమార్‌పట్నాయక్‌లకు అన్ని విభాగాల సచి వాలయ ఉద్యోగులు వినతిపత్రాలు అందజేశారు. బదిలీల్లో సొంత మండలాల్లో పని చేసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు పలు సమస్యల పరిష్కరించాలని వినతిపత్రాలను అందించారు.
ఫమందస,జూన్26(ఆంధ్రజ్యోతి):మందస మండల సచివాలయఉద్యోగులు మండ ల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిరసనతెలిపారు.రేషనలేజైషన్, బదిలీలు, పదోన్న తులు పారదర్శకంగాచేపట్టాలని ఎంపీడీవో వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు.
ఫ వజ్రపుకొత్తూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని సచివాలయ ఉద్యోగులు ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో రమేష్‌నాయుడు కు వినతిపత్రం అందించారు.
Updated Date - Jun 26 , 2025 | 11:55 PM