ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

jai Bharath: జయహో భారత్‌

ABN, First Publish Date - 2025-05-08T23:50:24+05:30

Victory to India పహల్గామ్‌ ఉగ్ర దాడికి ప్రతీ కారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత సైన్యానికి మద్దతుగా గురువారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో ‘జయహో భారత్‌’ అంటూ జాతీయపతాకాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ చేపట్టారు.

పలాస ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష, జీడి వ్యాపారులు

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు మద్దతుగా ర్యాలీ

  • టెక్కలి/ పలాస, మే 8(ఆంఽధ్రజ్యోతి): పహల్గామ్‌ ఉగ్ర దాడికి ప్రతీ కారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత సైన్యానికి మద్దతుగా గురువారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో ‘జయహో భారత్‌’ అంటూ జాతీయపతాకాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ చేపట్టారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసి విజయవంతమైన సైనికులకు సెల్యూట్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, నేతలు హనుమంతు రామకృష్ణ, లవకుమార్‌, జగదీశ్వరరావు, షణ్ముఖరావు, ప్రీతీష్‌, ప్రసాద్‌ రెడ్డి, మల్లిపెద్ది మధు, టీఎస్‌ఎన్‌ రమణ, కిరణ్‌ పాల్గొన్నారు.

  • పలాసలో జీడివ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా జంక్షన్‌ నుంచి జీడిపండు జంక్షన్‌ వరకు ర్యాలీ చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినదించారు. జయహో భారత్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్థాన్‌కు కేంద్రప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. దేశాన్ని అస్థిర పరిచే ఏ శక్తులకైనా ఇటువంటి గుణపాఠం తప్పదు. సరిహద్దులో పోరాటం చేస్తున్న సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల’ని కోరారు. కార్యక్రమంలో జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్‌, కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, కోశాధికారి మల్లా సంతోష్‌, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావు యాదవ్‌, టీడీపీ నేతలు పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్‌, ఎం.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2025-05-08T23:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising