ఉన్మాదిలా జగన్‌రెడ్డి ప్రవర్తన: జనసేన
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:15 AM
ఉన్మాది లా.. సమాజం సిగ్గుపడేలా మాజీ సీఎం జగన్‌రెడ్డి ప్రవ ర్తిస్తున్నాడని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చం ద్రమోహన్, సుడా చైర్మన్ కొరికాన రవి కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఉన్మాది లా.. సమాజం సిగ్గుపడేలా మాజీ సీఎం జగన్‌రెడ్డి ప్రవ ర్తిస్తున్నాడని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిసిని చం ద్రమోహన్, సుడా చైర్మన్ కొరికాన రవి కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. బుధవారం బల గ ఆదివారంపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంద ని, అయితే మాజీ సీఎం జగన్‌రెడ్డి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని, ఆయన మానసిక పరిస్థితి అర్థం కావడం లేదన్నారు. పొదిలిలో వైసీపీ కార్యకర్తల అరాచకం అనంతరం ప్రజల భద్రతా దృష్ట్యా పోలీసులు జగన్ పల్నాడు పర్యటనకు కొన్ని షరతు లు విధించిందన్నారు. అయితే ప్రతి పర్యటనను జగన్ రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో కుట్ర వ్యూహాలను అమలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి విపరీత ధరోరణల వల్లే ఇటీవల జరిగిన రోడ్‌షోలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల ప్రాణాలు కోల్పో వడం బాధకరమన్నారు. బెట్టింగ్‌లో సొమ్ము పోగొట్టుకొని ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టడమే కాకుండా, ఆ విగ్రహావిష్కరణకు జగన్ వెళ్లి పరా మర్శ పేరుతో పర్యటన చేసి ఇద్దరిని బలితీసుకున్నాడని, దీనిని ఉన్మాద చర్య కాదా అ ని ప్రశ్నించారు. సింగయ్య కారు కింద పడినా పట్టించుకోకుండా స్వయంగా వాహనం పై ఉండి ఘటన తెలిసినా కూడా స్పందించని వ్యక్తిని ఏమనాలన్నారు. మానవత్వం లేని జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారో ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాల న్నారు. జనసేన పార్టీ నాయకులు పాత్రుని పాపారావు, తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:15 AM