ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెన్నుపోటుకు ప్రతిరూపం జగన్‌రెడ్డి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:07 AM

వెన్నుపోటుకు పేటెంట్‌ వైసీపీ అని, అందుకు ప్రతిరూపం మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అంటూ పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వివమర్శించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌
  • ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పొందూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): వెన్నుపోటుకు పేటెంట్‌ వైసీపీ అని, అందుకు ప్రతిరూపం మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అంటూ పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వివమర్శించారు. మంగళ వారం మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మా ట్లాడారు. తన ఎదుగుదలకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని, తన భుజాన ఎత్తుకు పెంచిన బాబాయిని వెన్నుపోటు పొడిచి, గొడ్డలిపోట్లకు గురిచేసి హత్యచేసి, ఆస్తికోసం తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. ఏడాది ప్రజారంజకం గా పాలించిన కూటమి ప్రభుత్వంపై కక్ష సాధింపుకే బుధవారం వెన్నుపోటు దినంగా ప్రకటించిన జగన్‌రెడ్డి.. తన రాజకీయానికి సమాధికట్టి ఏడాదైన సందర్భంగా వైసీపీ వర్ధింతిదినం జరుపుకోవాలన్నారు.

పండగను విజయవంతం చేయాలి

వివిధ శాఖల అధికారులు, పండగ నిర్వహణ కమిటీ సమన్వయంతో ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న అమ్మవారి పండగలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రవి కుమార్‌ సూచించారు. పండగ ఏర్పాట్లపై మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, పండగ ని ర్వహణ కమిటీ, గ్రామస్థులతో సమీక్షించారు. ట్రాఫిక్‌ సమస్యపై దృష్టిపెట్టాలని సీఐ సత్యనారా యణకు సూచిం చారు. అలాగే మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ఫేజ్‌-1, ఫేజ్‌-2 నాడు-నేడు పనుల పై హెచ్‌ ఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్స్‌, ఇంజనీరింగ్‌ అధికా రులు, ఎంఈవోలతో సమీక్షించారు. పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.వెంకటరావు గైర్హాజరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, చైర్మన్‌ మాజీ ఏఎంసీ ఎ.రాము, నాయకులు సేపాన శ్రీరంగ నాయకులు, ఎ.చినరంగ, బలగ శంకరభాస్కర్‌, బాడాన గిరి, చింతాడ వాసుదేవరావు, సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో టైలరింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రారంభించారు. ఈ శిక్షణను మహిళలు వినియో గించుకోవాలన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:07 AM