జగన్ నువ్వసలు మనిషివేనా?
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:27 AM
‘జగన్.. నువ్వసలు మనిషివేనా? మహిళా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నావు’ అం టూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
కూటమి పాలన చూసి ఓర్వలేకే విమర్శలు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆగస్టు 1(ఆంధ్ర జ్యోతి): ‘జగన్.. నువ్వసలు మనిషివేనా? మహిళా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తున్నావు’ అం టూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ‘ఐదేళ్లు పరిపాలించడం చేతకాక.. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి నాటి ప్రతిపక్ష పార్టీ నేతల ను, సామాన్య ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేయ డంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందడం వల్ల ఆ పార్టీ అధినేత జగన్‌కి మతి భ్రమించింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉంటుంటే అది చూసి ఓర్వలేకపోతు న్నాడు జగన్. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రానికి పెట్టు బడులు వస్తుంటే జీర్ణించుకోలేక ప్రజా ప్రభుత్వంపై జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తు న్నాడు. అవినీతిపరు లను, దొంగలను, బెట్టింగ్ ఆడేవారిని, సంస్కారం లేని వ్యక్తు లను వెనకేసుకొచ్చే జగన్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని విమ ర్శించే అర్హత లేదు. ఒక మహి ళా ఎమ్మెల్యేను అసభ్యకరంగా మాట్లాడి.. వ్యక్తి గతంగా దూషించిన ప్రసన్నకుమార్ రెడ్డిని, అవినీతి చేసి జైలులో ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డిని పరామర్శించేందుకు జగన్ రావడం విడ్డూరంగా ఉంది. మరలా అధికారంలోకి వస్తే ఎవరినీ వదలమని వైసీపీ నాయకులు హెచ్చరిస్తు న్నారని.. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని.. వారికి ఓట్లు వేసే పరిస్థితి ఉండకపోగా రోడ్లపై కూడా జగన్ రెడ్డిని, వైసీపీ నాయకులను తిరగనివ్వరు’ అని హెచ్చరించారు.
Updated Date - Aug 02 , 2025 | 12:27 AM