ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీబీపీ హవల్దార్‌ ఆత్మహత్య

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:16 AM

పట్టణంలోని పద్మనాభ పురం శివాజీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఐటీబీపీ హవల్దార్‌ బద్రి ఈశ్వరరావు(36) శనివారం ఆత్మహత్య చే సుకున్నారు.

పలాస, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పద్మనాభ పురం శివాజీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఐటీబీపీ హవల్దార్‌ బద్రి ఈశ్వరరావు(36) శనివారం ఆత్మహత్య చే సుకున్నారు. ఈశ్వరరావు జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహి స్తున్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్‌ 11న సెలవుపై స్వగ్రామం శివాజీనగర్‌ కాలనీకి వచ్చారు. తన బావమరిది ఇంటిలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు. శనివారం ఆయన భార్య బాలసరస్వతి, ఆమె సోదరుడు, వదిన కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈశ్వరరావు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాశీబుగ్గ సీఐ పి.సూ ర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి తాళలేక ఈశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వరరావుకు భార్య బాలసరస్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో శివాజీనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.

కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌..

కొత్తూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): నేరడి-గురండి రహదారి సమీపంలో శనివా రం సాయంత్రం టేకు చెట్టుకు ఉరివేసుకుని పెద్దకోట గోవిందరావు(49) అనే ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలిపారు. మె ట్టూరు బిట్‌-2 పంచాయతీ నిర్వాసిత కాలనీకి చెందిన గోవిందరావు ఆటో నడు పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య గూనభద్ర ఆర్‌ఆర్‌ కాలనీ అంగన్‌ వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు. కుటుంబ కలహాల కారణంగా గోవిందరావు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలు స్తుందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Aug 03 , 2025 | 12:16 AM