ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాసేవంటే ఇదేనా?

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:47 PM

వాహన లైసెన్సుల జారీ, రెన్యువల్స్‌, ఫిట్‌నెస్‌ తనిఖీలు వంటి కీలక విధులు నిర్వహించే విజయనగరం రవాణాశాఖాధికారి కార్యాలయం వద్ద ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు.

రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే రహదారి

విజయనగరం క్రైం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): వాహన లైసెన్సుల జారీ, రెన్యువల్స్‌, ఫిట్‌నెస్‌ తనిఖీలు వంటి కీలక విధులు నిర్వహించే విజయనగరం రవాణాశాఖాధికారి కార్యాలయం వద్ద ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. కార్యాలయం పని మీద నిత్యం వందలాదిమంది వస్తుంటారు. వారంతా అక్కడి పరిస్థితులు చూసి విసుగుచెందుతున్నారు. కార్యాలయానికి చేరుకునే రహదారి కూడా అధ్వానంగా ఉంది. మరుగుదొడ్లు లేక మహిళలు అవస్థలు పడుతున్నారు. ప్రజలకు తాగునీటిని అందించే కుండలను వర్షంలోనే వదిలేశారు. కార్యాలయంలో రవాణాశాఖ ఉప కమిషనర్‌, రవాణాశాఖాధికారి, మోటార్‌ వె హికల్‌ ఇన్‌స్పెక్టర్లు, కార్యాలయం సిబ్బంది కలిపి 20 మంది వరకూ విధులు నిర్వహిస్తుంటారు. వీరికి కార్యాలయంలో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఇతరత్రా సౌకర్యాలు ఉన్నాయి. కానీ రవాణాశాఖ కార్యాలయానికి పనిమీద వచ్చేవారికి మాత్రం కనీస వసతులు లేని దుస్థితి. ప్రతిరోజూ రవాణాశాఖకు వేలాది రూపాయల ఆదాయం వాహనదారుల నుంచి సమకూరుతోంది. వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై కార్యాలయ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోవడం లేదు. వారే వస్తారు.. వెళ్తారు..అన్న రీతిలో అధికారులు ఉంటున్నారు. కార్యాలయానికి వచ్చే మహిళల పరిస్థితి మరింత దయనీయం. వారికి మరుగుదొడ్లు లేవు. ఇటీవల కాలంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో వాహనాలు వినియోగిస్తున్నారు. వారంతా లైసెన్సు కోసం ఇక్కడికే వస్తున్నారు. ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తే నరకయాతన పడుతున్నారు. మంచినీటి సౌకర్యం కూడా లేదు. వేసవి కాలంలో రెండు కుండలు ఏర్పాటు చేశారు. వాటిలో నీరే తాగాలి. లేదంటే బయట కొనుక్కోవాల్సిందే. వర్షం కురిస్తే వాటి పరిస్థితి దారుణం. నీటి కుండలు వర్షంలోనే ఉంటున్నాయి. ఇంకోవైపు రవాణాశాఖ కార్యాలయం లోపలికి వెళ్లాలంటే నరకమే. సిమెంట్‌ రోడ్డు కూడా లేదు. మట్టి రోడ్డు గోతుల మయమైపోయింది.
త్వరలో సౌకర్యాలు కల్పిస్తాం..
రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే రహదారి పాడైంది. అయితే ఎన్నో పర్యాయాలు మరమ్మతులు చేసినా వర్షానికి మళ్లీ అధ్వానంగా మారుతోంది. కార్యాలయ ఆవరణలో శాశ్వతంగా మరుగుదొడ్లు నిర్మిస్తాం. ఇతర మౌలిక వసతులు కూడా కల్పిస్తాం. కార్యాలయానికి వచ్చే వాహనదారులకు మంచినీటి సమస్య లేకుండా చూస్తాం.
-మణికుమార్‌, రవాణాశాఖ ఉపకమిషనర్‌

Updated Date - Jun 30 , 2025 | 11:47 PM