ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

minister achhenna: ప్రతి ఎకరాకు సాగునీరు

ABN, Publish Date - May 06 , 2025 | 11:20 PM

Water Resources ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగం కుదేలైంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామ’ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
  • - ఎత్తిపోతల పథకాల ఆఽధునికీకరణకు రూ.12కోట్లతో ప్రతిపాదనలు

  • - మంత్రి అచ్చెన్నాయుడు

  • టెక్కలి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ రంగం కుదేలైంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామ’ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యమివ్వాలి. రూ.4.80 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాలి. 14 ఎత్తిపోతల పథకాల పనుల ఆధునికీకరణకు రూ.12కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలి. శ్రీపురం, కురుడు, పొడుగుపాడు, నారాయణవలస, కొత్తపేట, నారాయణపురం, చిన్నసాన, నిమ్మాడ, పోలవరం, సుభద్రాపురం, మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకాలు పరిశీలించి ఏఏ ప్రాంతాలకు సాగునీరు అందించాలో గుర్తించాలి. టెక్కలి మండలం బూరగాం, లింగాలవలస, సంతబొమ్మాళి మండలం గొదలాం గ్రామాలకు చెందిన రైతుల విజ్ఞప్తి మేరకు ఎత్తిపోతల పథకాలు మంజూరుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. ఖరీఫ్‌ నాటికి ఎత్తిపోతల పథకాలన్నీ వినియోగంలోకి తీసుకురావాలి’ అని ఆదేశించారు. సమావేశంలో ఈఈ కేవీ సుబ్రహ్మణ్యం, డీఈఈ కామరాజు, ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:20 PM