డిజిటల్ అసిస్టెంట్‌పై విచారణ
ABN, Publish Date - May 29 , 2025 | 11:44 PM
లండారిపుట్టుగ గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌పై ఎంపీడీవో విశ్వేశ్వరరావు గురువా రం విచారణ చేపట్టారు.
కవిటి, మే29(ఆంధ్ర జ్యోతి): లండారిపుట్టుగ గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌పై ఎంపీడీవో విశ్వేశ్వరరావు గురువా రం విచారణ చేపట్టారు. రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకోసం వచ్చిన లబ్ధిదారు లపై డిజిటల్ అసిస్టెంట్ ఈశ్వరరావు దురుసుగా ప్రవర్తించడంతో బుధవారం ఆంధ్రజ్యోతిలో నన్నే ప్రశ్నిస్తారా.. డిజిట ల్ అసిస్టెంట్ హల్‌చల్ శీర్షికతో కథనం ప్రచురితయ్యింది.దీంతో స్పందించిన ఎంపీ డీవో విశ్వేశ్వరరావు, ఈఓఆర్డీఅబ్దుల్ ఖాన్ సచివాలయానికి వెళ్లి విచారణ చేశారు. లబ్ధిదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ఇకపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని డిజిటల్ అసిస్టెంట్‌ను హెచ్చరించారు.
Updated Date - May 29 , 2025 | 11:44 PM