ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:32 PM
టెక్కలిలో వ్యవ సాయశాఖ, విజి లెన్స్ యంత్రాంగం మంగళవారం విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీచేశాయి
టెక్కలి, జూలై 15(ఆంధ్రజ్యోతి): టెక్కలిలో వ్యవ సాయశాఖ, విజి లెన్స్ యంత్రాంగం మంగళవారం విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీచేశాయి. ఆయా షాపుల్లో అధికారులు స్టాక్ రిజిస్ట్రార్, బిల్లు పుస్తకాలు, దస్త్రాలు, గోదాములు తనిఖీ చేశారు. హోల్‌సేల్, రిటైల్ అమ్మకాల పత్రాలు సరిగ్గా నిర్వహించకపోవడంతో వైశ్యరాజు వెంకటరాజు దుకాణంలో లక్ష రూపాయల ఎరువుల అమ్మకాలు నిలిపివేశారు.తనిఖీల్లో వ్యవసాయశాఖ సహాయసంచాలకుడు బొడ్డేపల్లి విజయ్‌ప్రసాద్, విజిలెన్స్ సీఐ ఆడారి సంతోష్‌కుమార్, ఏవో ఎన్.శ్రీనివాసరావు, జిల్లా వనరుల కేంద్రం నుంచి ఏడీ సీహెచ్ వెంకట్రావు, వ్యవసాయ విస్తరణాధికారి సంతోష్ పాల్గొన్నారు.
ఫనరసన్నపేట, జూలై 15(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని శ్రీరామ ఫెర్టిలైజర్స్‌లో విజలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. రూ.4.04 లక్షలు విలువచేసే కలుపు మందుల విక్రయం నిలిపివేశారు.571 లీటర్ల కలుపు మందును సీజ్‌చేశారు. లైసెన్స్ ప్రకారం ఇవ్వాల్సిన రిపోర్టులు సరిగా సబ్‌మిట్ చేయకపో వడంతో అమ్మకాలను నిలిపివేసినట్లు ఏవో సూర్యకుమారి తెలిపారు.
Updated Date - Jul 15 , 2025 | 11:32 PM