అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:58 PM
మునిసి పాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఐసీ డీఎస్ ఇన్‌చార్జి పీవో సుజాత తనిఖీ చేశారు.
బెల్లుపడలో కందిపప్పు పరిశీలిస్తున్న ఇన్‌చార్జి పీవో సుజాత
ఇచ్ఛాపురం, జూలై 31(ఆంధ్రజ్యోతి): మునిసి పాలిటీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఐసీ డీఎస్ ఇన్‌చార్జి పీవో సుజాత తనిఖీ చేశారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పుచ్చుపోయి..పురుగు పట్టి’ శీర్షికతో వచ్చిన కథనానికి ఐసీడీఎస్ అధికా రులు స్పందించారు. బెల్లుపడ అంగన్‌వాడీ కేంద్రంలో డీలర్ల ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. సరుకుల్లో ఎటువంటి నాణ్యత లోపించినా వెంటనే ఐసీడీఎస్ కార్యాల యంతో పాటు పౌర సరఫరాల స్టాక్ పాయింట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆమె సూచించారు.
బెల్లుపడలో కందిపప్పు పరిశీలిస్తున్న ఇన్‌చార్జి పీవో సుజాత
Updated Date - Jul 31 , 2025 | 11:58 PM