ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:35 PM

నియోజక వర్గంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అవ సరమయ్యే మౌలిక సదుపా యాల కల్పనకు చర్యలు తీసు కుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ఉన్నత పాఠశాల తరగతి గదిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అవ సరమయ్యే మౌలిక సదుపా యాల కల్పనకు చర్యలు తీసు కుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. స్థానిక సాయి కాలనీలో యూపీ పాఠశాల అప్‌గ్రేడ్‌ కాగా గురువారం తరగ తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుతు న్నారని, వారి తల్లిదండ్రుల వినతి మేరకు 9, 10 తరగతులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. అన్ని వసతులతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూని ఫారాలు, స్కూల్‌ బ్యాగ్‌ కిట్లు అందిస్తు న్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత పాఠశాల విద్యను బలో పేతం చేస్తోందన్నారు. ‘తల్లికి వందనం’ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు బదిలీ చేశామని, విద్యార్థుల వికాసానికి ఈ నిధులు వినియోగపడతాయన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధన చేసి విద్యార్థుల సంక్షేమానికి పాటు పడాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదరణ ద్వారా లబ్ధి దారులకు పనిముట్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, పలువురు ఉపాధ్యా యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:35 PM