పచ్చిరొట్ట ఎరువుతో భూసారం పెరుగుదల
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:44 PM
పచ్చిరొట్ట ఎరువుతో భూసారం పెరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 21(ఆంధ్రజ్యోతి): పచ్చిరొట్ట ఎరువుతో భూసారం పెరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం పచ్చిరొట్ట పై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చిరొట్టను వాడడం వల్ల 25శాతం ఎరువులు ఆదా అవుతా యని, అంతే కాకుండా మట్టికి జీవం వస్తుందన్నారు. నేల సారం పెరిగి, సాగు ఖర్చులు తగ్గు తాయని, పంటకు బలం చేకూ రుతుందన్నారు. ప్రతి రైతు పచ్చి రొట్టను వినియోగిం చాలని కోరారు. బయో ఫెర్టిలైజర్స్ వాడేటప్పుడు గడువు మించ కుండా జాగ్రత్త పడాలన్నారు. రసా యనిక ఎరువులు, కీటక నాశనాలతో కలిపి వేయకూడదని, నేలలో తగి నంత తేమ ఉన్నప్పుడు వాడితే మంచిదన్నారు. కార్యక్రమం లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్. డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 11:44 PM