ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

fish landing center: ఎప్పుడు ఫినిష్‌ చేస్తారో?

ABN, Publish Date - May 11 , 2025 | 11:39 PM

Fish Landing Incomplete Construction వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు- మంచినీళ్లపేట సముద్ర తీరంలో చేపడుతున్న ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ఉప్పుటేరు ఒడ్డునే నిలిపిన బోట్లు
  • నత్తనడకన ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు

  • ఐదేళ్లలో 30శాతం కూడా పూర్తికాని వైనం

  • వైసీపీ ప్రభుత్వంలో విడుదల కాని నిధులు

  • ప్రస్తుత ప్రభుత్వంపైనే మత్స్యకారుల ఆశలు

  • వజ్రపుకొత్తూరు, మే 11(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు- మంచినీళ్లపేట సముద్ర తీరంలో చేపడుతున్న ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా 30శాతం కూడా పూర్తికాలేదు. గత వైసీపీ ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా జాప్యం చేయడంతో పనులు ముందుకు కదల్లేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపైనే మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • సముద్రంలో వేటాడిన చేపలను నిల్వ ఉంచి, డిమాండ్‌ ఉన్న సమయంలో మంచి ధరకు వాటిని అమ్మకాలు చేసుకునేందుకుగాను నువ్వలరేవు- మంచినీళ్లపేట తీరంలో ఫిష్‌ ల్యాండింగ్‌ నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020 జూన్‌లో అప్పటి మంత్రి హోదాలో సీదిరి అప్పలరాజు భూమిపూజ చేశారు. రూ.11.95కోట్లు వ్యయంతో ఏడాదిన్నరలోపే పనులు పూర్తి చేసి, మత్స్యకారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించాడు. అయితే, బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో పనులను నిలిపేశాడు. ఫిష్‌ ల్యాండింగ్‌ను జట్టీగా మార్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని, అందువలనే పనులు ఆలస్యమవుతున్నట్టు వైసీపీ నాయకులు కొత్తభాష్యం చెప్పడం మొదలు పెట్టారు. ఈ లోగా నిర్మాణ వ్యయం పెరిగింది. దీంతో రూ.13.95 కోట్లకు అంచనా వ్యయం పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటివరకు వాటికి సంబంధించి నిధులు మంజూరు కాలేదు.

  • ప్రభుత్వంపైనే ఆశలు

  • ప్రస్తుతం 30శాతం పనులు జరిగాయి. మిగిలిన పనులు జరగాలంటే అంచనావ్యయం పెంచాలని అధికారులు చెబుతున్నారు. అప్పుడే ఫిష్‌ ల్యాండింగ్‌ నిర్మాణం పూర్తి చేయగలమని మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ అంటున్నారు. పనులు పూర్తికాకపోవడంతో ఉప్పుటేరు ఒడ్డున బోట్లు నిలిపి ఉంచుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చాలంటే మధ్యలో ఉన్న ఉప్పుటేరు దాటి రావాల్సి వస్తుందని, దీంతో సముద్రపు ఒడ్డునే తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిష్‌ ల్యాండింగ్‌ నిర్మాణంతో తమ సమస్యలు తీరుతాయని, ప్రభుత్వం స్పందించి పనులు పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

  • పనులు పూర్తి చేస్తాం

  • నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ వ్యయం పెరిగింది. అంచనావ్యయాన్ని రూ.11.95 కోట్లు నుంచి రూ.13.95 కోట్లుకు పెంచుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలయితే పనులు పూర్తి చేస్తాం.

    - సత్యనారాయణ, డీడీ, మత్స్యశాఖ

  • వైసీపీ ప్రభుత్వమే కారణం

    గత వైసీపీ ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు పూర్తికాలేదు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆపేశాడు. పనులు పూర్తిచేసి మత్స్యకారులను ఆదుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీషకు విజ్ఞప్తి చేశాం.

    - వెంకటేష్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, నువ్వలరేవు

  • మినీ జట్టీయే ఆధారం

    టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు నువ్వలరేవు తీరంలో మినీ జెట్టీని నిర్మించారు. అదే ఇప్పటికీ మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడే చేపలు నిల్వ ఉంచి వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. ఫిష్‌ ల్యాండింగ్‌ పనులు పూర్తయితే మత్స్యకారులకు మరింత ఉపయోగంగా ఉంటుంది.

    - ఆనంద్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు

Updated Date - May 11 , 2025 | 11:39 PM