ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:55 PM

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌ షాలెంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్‌ షాలెంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పాస్టర్‌ షాలెంరాజు మల్లెపూలు పెట్టుకున్న స్త్రీలు బజారు స్త్రీలంటూ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలోని స్త్రీలందరినీ అవమానించడమేనని అన్నారు. సనాతన హిందూ సంప్రదాయంలో స్త్రీలకు అతి పవిత్రమైన పంచ మాంగల్యాలు అయిన పసుపు, కుంకుమ, మాంగల్యం, గాజులు, పువ్వులు ధరించడంపై నీచంగా, హేళనగా మాట్లాడడం క్షమించరాని విషయమని మండిపడ్డారు. అనంతరం వారు డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా మాతృమండలి ప్రముఖ్‌ వారణాశి, సంతోషి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శవ్వాన ఉమామహేశ్వరి, పి.ఢిల్లేశ్వరి, టి.రజని, జయలక్ష్మి, పి.శ్యామల, సీహెచ్‌ సరోజిని, ఆర్‌.చంద్రమ్మ, పి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:55 PM