Rain fall: వేసవిలో.. అధిక వర్షపాత‘మే’
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:01 AM
Heavy rains in May సిక్కోలు.. అత్యధిక తీరప్రాంతం కలిగిన పేదల ఊటీగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వేసవి తీవ్ర ప్రతాపం చూపినా.. జిల్లాలో మాత్రం మే నెలలో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఏప్రిల్‌లో అడుగంటిన భూగర్భ జలాలు మే నెలలో కురిసిన వర్షాల ప్రభావంతో పైకి వచ్చాయి.
మే నెలలో పుష్కలంగా వర్షాలు
జూన్ ఆరంభంలోనూ అదేరీతిన..
మొత్తంగా 25.88 మిల్లీమీటర్లు అదనం
పెరిగిన భూగర్భ జలమట్టం
శ్రీకాకుళం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): సిక్కోలు.. అత్యధిక తీరప్రాంతం కలిగిన పేదల ఊటీగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది వేసవి తీవ్ర ప్రతాపం చూపినా.. జిల్లాలో మాత్రం మే నెలలో రికార్డుస్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఏప్రిల్‌లో అడుగంటిన భూగర్భ జలాలు మే నెలలో కురిసిన వర్షాల ప్రభావంతో పైకి వచ్చాయి. ఈ నెలలోనూ అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉండడంతో ఎండల ప్రభావం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆశించినస్థాయి కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.
లోటు నుంచి పైపైకి...
వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో 27.59 మి.మీ వర్షం కురవాలి. కానీ కేవలం 12.8మి.మీ మాత్రమే వర్షం కురిసింది. అందుకే జిల్లా ప్రజలు ఏప్రిల్‌లో తీవ్ర వేడితో ఇబ్బందులు పడ్డారు. ఇక మే నెల విషయానికొస్తే... 92.33 మిల్లీమీటర్లు వర్షానికిగానూ 159.97 మి.మీ వర్షం కురిసింది. అంటే ఏకంగా 67.64 మిల్లీమీటర్లు వర్షం అదనంగా కురిసింది. దీంతో మే నెలలో వేడిమి ఎక్కువగా ఉన్నా కాస్త ఉపశమనం కూడా లభించింది. ఈ నెలలో ఒకటి నుంచి 15 రోజుల వరకు 57.99 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే 67.21 మి.మీ వర్షం కురిసింది. దీనివల్ల సాధారణ వర్షపాతం కంటే జూన్ సగంలోనే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో మే, జూన్ .. ఇప్పటివరకు పరిశీలిస్తే ఏకంగా 25.88 మిల్లీమీటర్లు వర్షపాతం అధికంగా కురిసింది.
నిండిన చెరువులు.. జలాశయాలు
అదనపు వర్షపాతం వల్ల జిల్లాఅంతటా చెరువులు కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు కూడా పైకి వచ్చాయి. కేవలం కవిటి, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పోలాకి మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. ఈ నాలుగు మండలాల్లో భూగర్భ జలాలు కాస్త తగ్గుదల ఉంది. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 9.68 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండేవి. ఇప్పుడు 9.84 మీటర్లు లోతున భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో -0.16 మీటర్లు లోతున భూగర్భ జలాలు ఉండేవి. గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31వరకు 1,156 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉంది. అయితే 1,247.11 మి.మీ వర్షపాతం కురిసింది. ఏడాదిలో 7.88 శాతం అధిక వర్షపాతం వల్ల భూగర్భ జలాలు కూడా పైకి వచ్చాయి. అందుబాటులో జలం లభ్యమవుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీరు కూడా పుష్కలంగా లభించే అవకాశం ఉండడం శుభపరిణామమే.
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
-----------------------
మే నెల జూన్ (1 నుంచి 15 రోజులు) అధిక/లోటు వర్షం
=========================================================================================
మండలం కురవాల్సినది కురిసినది కురవాల్సినది కురిసినది
=========================================================================================
ఆమదాలవలస 89 196.04 47.91 52.89 10.39
బూర్జ 90.6 180.6 49.42 61.38 24.2
ఎచ్చెర్ల 94.1 190.09 44.63 49.26 10.37
జి.సిగడాం 92.1 166.98 43.24 63.61 47.11
గార 81.2 205.51 50.74 51.34 1.18
హిరమండలం 101.6 167.38 59.1 74.49 26.04
ఇచ్ఛాపురం 86.9 113.59 63.94 44.43 -30.51
జలుమూరు 107.5 203.36 48.56 57.33 18.06
కంచిలి 97.1 109.45 58.14 71.51 23
కవిటి 92.4 111.53 68.56 59.05 -13.87
కోటబొమ్మాళి 81.8 192.97 40.81 62.45 53.03
కొత్తూరు 118.7 165.43 58.19 76.32 31.16
లావేరు 88.7 175.59 51.8 54.84 5.87
ఎల్.ఎన్.పేట 85.9 178.52 46.63 66.81 43.28
మందస 90.3 109.54 56.72 79.59 40.32
మెళియాపుట్టి 106.8 131.64 64 83.37 30.27
నందిగాం 79.8 121.26 45.84 87.4 90.66
నరసన్నపేట 95.8 208.5 62.94 53.56 -14.9
పలాస 89.1 112.46 55.61 83.12 49.47
పాతపట్నం 98.7 160.54 56.45 78.15 38.44
పోలాకి 99.8 213.93 66.92 53.13 -20.61
పొందూరు 105.4 184.72 44.23 53.89 21.84
రణస్థలం 88.5 145.33 53.04 67 26.32
సంతబొమ్మాళి 88.4 168.37 47.16 69.8 48.01
సారవకోట 106.8 178.48 61.65 69.48 12.7
సరుబుజ్జిలి 85.9 193.6 46.63 58.73 25.95
సోంపేట 88.8 107.84 53.14 76.59 44.13
శ్రీకాకుళం 74.3 196.7 40.95 51.56 25.91
టెక్కలి 79.4 148.54 61.29 78.62 28.28
వజ్రపుకొత్తూరు 84.5 117.35 53.47 87.41 63.47
=========================================================================================
మొత్తం 92.33 159.97 53.39 67.21 25.88
=========================================================================================
Updated Date - Jun 17 , 2025 | 12:01 AM