ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bridge: పూడిలంకకు తీరనున్న కష్టాలు

ABN, Publish Date - May 04 , 2025 | 11:38 PM

Coastal villages పూడిలంక వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి రూ.4కోట్లు మంజూరుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అంగీకరించారు. ఈ మేరకు జిల్లాపరిషత్‌ తీర్మానమైన వెంటనే పనులు చేపడతామని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) ఎస్‌.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉప్పుటేరు ఉధృతికి కొట్టుకుపోయిన పూడిలంక నడకదారి
  • వంతెన నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు

  • జడ్పీ తీర్మానమే తరువాయి..

  • వజ్రపుకొత్తూరు, మే 4(ఆంధ్రజ్యోతి): పూడిలంక వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల నుంచి రూ.4కోట్లు మంజూరుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అంగీకరించారు. ఈ మేరకు జిల్లాపరిషత్‌ తీర్మానమైన వెంటనే పనులు చేపడతామని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఈఈ) ఎస్‌.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షం కురిస్తేచాలు గ్రామం చుట్టూ ఉప్పునీరు చేరి బయట ప్రపంచంతో గ్రామస్థులకు సంబంధాలు ఉండేవికావు. మూడు నాలుగు రోజులు బయటకు రాకుండా గ్రామంలోనే ఉండిపోయిన సందర్భాలు అనేకం. దీంతో అధికారులు, నాయకులు సైతం ఆందోళన చెందేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014 - 2019 మధ్య) అప్పటి పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ పల్లివూరు జంక్షన్‌ నుంచి పూడిలంకకు గ్రావెల్‌ రోడ్డుకు నిధులు మంజూరు చేయించారు. చాలావరకు నిర్మాణ పనులు చేపట్టారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చి.. విస్మరించింది. గతేడాది ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష.. కూటమి అధికారంలోకి వస్తే వంతెన నిర్మాణ పనులు చేపడతామని పూడిలంక గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి పూడిలంక దుస్థితిని వివరించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు కూడా అనేకసార్లు పూడిలంక వంతెన నిర్మాణాలు నిధులు కేటాయించాలని కోరారు. ఇటీవల కలెక్టర్‌ను కూడా కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. దీంతో రూ.4కోట్ల నిధులు మంజూరుకు కలెక్టర్‌ అంగీకరించడంతో పూడిలంక వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మిస్తే తమకు ముంపు కష్టాలు తీరనున్నాయని పేర్కొంటున్నారు.

Updated Date - May 04 , 2025 | 11:38 PM