ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:04 AM

పురుషోత్తపురం చెక్‌పోస్టు మీదుగా అక్రమంగా మద్యం, సారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తరలిపోకుండా అడ్డుకట్ట వేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

రికార్డులు పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పురుషోత్తపురం చెక్‌పోస్టు మీదుగా అక్రమంగా మద్యం, సారా, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తరలిపోకుండా అడ్డుకట్ట వేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మ ద్యం అక్రమంగా తరలిపోకుండా అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఒడిశా నుంచి సారా రవాణా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నవోదయం కార్యక్రమం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయా లన్నారు. పెండింగ్‌ కేసులు తగ్గించాలని, చార్జిషీట్‌ త్వరగా వేయా లన్నారు. ఎక్సైజ్‌ సీఐ పి.దుర్గాప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:05 AM