వైసీపీ హయంలో అక్రమ నిర్మాణాలు
ABN, Publish Date - May 15 , 2025 | 12:02 AM
వైసీపీ ప్రభుత్వహయంలో నాయకులు ఆక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టారని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు.
నరసన్నపేట, మే 14(ఆంధ్రజ్యోతి):వైసీపీ ప్రభుత్వహయంలో నాయకులు ఆక్రమణలకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపట్టారని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. బుధవారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ నిధులతో పార్కు నిర్మాణంచేపడితే తప్పుడుపత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అనుమతి లేకుండా వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని గుర్తించాలన్నారు. వంశధార ఈఈ కార్యాలయంలో సమీపంలో వైసీపీ వార్డు సభ్యులు స్థలాన్ని కబ్జా చేసి తన బంధువులకోసం ఇళ్లు నిర్మించడంతో అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్యవిభాగ కార్యదర్శి జామి వెంకట్రావు, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, ఉణ్న వెంకటేశ్వరరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహార్ష, పీసకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 12:02 AM