ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

performance పనితీరు మెరుగుపర్చుకోకుంటే తొలగిస్తాం

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:38 PM

performance ఉపాధి హామీ పథకం నిర్వ హణలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనితీరు మెరుగుపరచుకోవాలని లేకుంటే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని డ్వామా పీడీ బి.సుధాకరరావు హెచ్చరించారు.

పలాస రూరల్‌: మాట్లాడుతున్న డ్వామా పీడీ సుధాకరరావు

డ్వామా పీడీ సుధాకరరావు

పలాసరూరల్‌,మార్చి19(ఆంధ్ర జ్యోతి): ఉపాధి హామీ పథకం నిర్వ హణలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనితీరు మెరుగుపరచుకోవాలని లేకుంటే విధుల నుంచి తొలగించడం జరుగుతుందని డ్వామా పీడీ బి.సుధాకరరావు హెచ్చరించారు. పలాస ఉపాధి హామీ కార్యాలయ ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు అలసత్వం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గ్రామాల్లో 90 శాతం వేతనదారులకు పనులు కల్పించకుంటే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవ న్నారు. కార్యక్రమంలో ఏపీడీలు రాధ, చల్లా శ్రీనివాసరెడ్డి, డీవీవో స్వరూపారాణి, ఏపీవో శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతగా పనిచేస్తారా? జీతాలు ఆపేయాలా?

కంచిలి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): బాధ్యతగా పనిచేస్తారా లేకుంటే జీతాలు ఆపేయాలా అని డ్వామా పీడీ బి.సుధాకరరరావు మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో బుఽదవారం ఉపాధి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనుల తీరుపై పీడీ అసహనం వ్యక్తం చేశారు. వేతనదారుల సంతకాలు గాని, వేలిముద్రలు గాని లేకుండానే చాలా చోట్ల మస్టర్లు వేయడంపై అధికారులను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి రూ.64,446 రికవరీ, 38,500 జరి మానా విధించారు. ఎంపీడీవో తిరుమలరావు, ఏపీవో జి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:38 PM