గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN, Publish Date - May 25 , 2025 | 12:39 AM
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఏపీ గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఆడిట్) పి.వెంకటరమణ అధికా రులను ఆదేశించారు.
మౌలిక వసతులు కల్పించాలి
జీఎమ్ వెంకటరమణ
శ్రీకాకుళం, మే 24(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఏపీ గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఆడిట్) పి.వెంకటరమణ అధికా రులను ఆదేశించారు. శనివారం ఆయన పెద్దపాడు, రాగో లు లేఅవుట్స్‌ను సందర్శించారు. ప్రతీ లే అవుట్‌లోను మౌ లిక వసతుల స్థితి, నిర్మాణాల నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశమై, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అదనపు ఆర్థిక సహాయం అంశంపై పూర్తి విషయాలను వివరించారు. అనంతరం శ్రీకాకుళం పట్టణంలో గల జడ్పీ సమావేశ మందిరంలో గృ హనిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వ హించారు. ప్రతీ లేఅవుట్‌కు సంబంధించిన పురోగతి వివ రాలపై ఆరాతీశారు. ఇప్పటికీ ప్రారంభం కాని, మంజూరైన ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గృ హనిర్మాణ సంస్థ జిల్లా అధికారి బి.నగేష్, ఈఈలు, డీఈ లు, సహాయక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. పర్యట న సందర్భంగా సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు హాజరై స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఆమదాలవలస మునిసిపాల్టీ పరిధిలో..
ఆమదాలవలస, మే 24(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలో గాజులకొల్లివలస, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఉన్న ఎన్‌టీఆర్ కాలనీ లేఅవుట్లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఏపీ గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఆడిట్) పి.వెంకటరమణ సూచించారు. శనివారం ఆయా లేఅవుట్లలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి కొంతమంది లబ్ధిదా రులతో మాట్లాడారు. ఈ సంద ర్భంగా హౌసింగ్ ఏఈ మోహన రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నతనడకన సాగుతున్న నిర్మాణా లపై ప్రశ్నించారు. పలువురు లబ్ధిదారులు బిల్లులు సక్రమంగా అందించకపోవడంతో నిర్మాణా లు చేపట్టలేకపోతున్నామని ఆ యన దృష్టికి సమస్య తీసు కెళ్లారు. ప్రస్తుతం బిల్లుల చెల్లింపులు, మెటీరియల్ సప్లై వేగవంతం చేస్తే నిర్మాణాలు పూర్తిస్థాయిలో వేగంగా చేస్తామని లబ్ధిదారులు చెప్పారు. దీనికి స్పందించిన ప్రత్యేకాధికారి నిర్మాణాలు వేగవంతం చేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని హౌసింగ్ ఏఈ మోహనరావుకు సూచించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ ఈఈ ఎ.అప్పారావు, హౌసింగ్ ఎఫ్‌ఏసీ డీఈ డి.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2025 | 12:39 AM