ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఈ-శ్రమ్‌’తో అసంఘటిత కార్మికులకు చేయూత

ABN, Publish Date - May 07 , 2025 | 11:42 PM

ఈ-శ్రమ్‌ బీమాతో అసంఘటిత కార్మికులకు చేయూత లభిస్తుందని జిల్లా లేబర్‌ అధికారి ఎం.నీలామోహన్‌ తెలిపారు.

మాట్లాడుతున్న జిల్లా లేబర్‌ అధికారి నీలామోహన్‌

- జిల్లా లేబర్‌ అధికారి నీలామోహన్‌

లావేరు, మే 7(ఆంధ్రజ్యోతి): ఈ-శ్రమ్‌ బీమాతో అసంఘటిత కార్మికులకు చేయూత లభిస్తుందని జిల్లా లేబర్‌ అధికారి ఎం.నీలామోహన్‌ తెలిపారు. బుధవా రం లావేరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఈ శ్రమ్‌ బీమాలో చేరడానికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదన్నారు. 18 నుంచి 60 ఏళ్లు లోపు వయస్సుగల వారు అర్హులన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే 60 ఏళ్లు వయస్సు వచ్చినం త వరకు బీమా వర్తిస్తుందని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.2 లక్షల వరకు బీమా సదు పాయం కల్పించినట్లు తెలిపారు. శాశ్వత వికలాంగు లైనా రూ.2 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,77,384 మంది ఈశ్రమ్‌ బీమాలో చేరారని, ఇంకా 4,53,989 మంది మిగిలి ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని ఉపాధి వేతనదారులకు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో సహాయ లేబర్‌ అఽధికారి ఆర్‌వీ శ్రీనివాసరా వు, ఏపీవో సత్యవతి, జేఈ లెలిన్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:42 PM