ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain: సిక్కోలులో జోరు వాన

ABN, Publish Date - May 02 , 2025 | 12:10 AM

Heavy Rain జిల్లాలో గురువారం రాత్రి జోరువాన కురిసింది. ఉరుములు.. మెరుపులతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించా యి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

శ్రీకాకుళంలో గురువారం రాత్రి కురుస్తున్న వర్షం
  • ఈదురుగాలుల బీభత్సం

  • శ్రీకాకుళం, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి జోరువాన కురిసింది. ఉరుములు.. మెరుపులతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించా యి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వర్షపునీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులు బలంగా వీయడంతో శ్రీకాకుళం లో పలుచోట్ల హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. శ్రీకాకుళం రూరల్‌తోపాటు పలుచోట్ల చెట్ల కొమ్మ లు విద్యుత్‌ వైర్లపై పడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సుమారు రెండున్నర గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతటా అంధకారం అలుముకుంది.

Updated Date - May 02 , 2025 | 12:10 AM