నేడు గురుపౌర్ణమి వేడుకలు
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:43 PM
గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించేందుకు నగరం లోని ఆలయాలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ ఉత్సవాలను కొన్ని ఆలయాల్లో ఇప్పటికే ప్రారంభిం చగా మరికొన్ని చోట్ల గురువారం నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం కల్చరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించేందుకు నగరం లోని ఆలయాలు, సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ ఉత్సవాలను కొన్ని ఆలయాల్లో ఇప్పటికే ప్రారంభిం చగా మరికొన్ని చోట్ల గురువారం నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెంఇన శ్రీతరుణి కృష్ణ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్ లో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసులు సుస రాపు గణపతి శర్మకు గురు సత్కారం చేయనున్న ట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నక్కవీధిలోని ఉమాజఠలేశ్వరాలయంలో షిర్డీసాయికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న సాయిగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహాన్నదానం నిర్వహించనున్నట్లు నిర్వా హకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాలు విద్యుద్దీపా లతో అలంకరించారు. విశాఖ-బి కాలనీ లోని షిర్డీ సాయిని ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాబా చిత్ర పటాన్ని ఊరేగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): పురుషోత్త పురం పుష్పగిరి కొండపై ఉన్న షిర్డీసాయి మంది రంలో వ్యాసపౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు లు తెలిపారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, ప్రత్యే క హారతులు నిర్వహిస్తున్నామని, భక్తులు పాల్గొని కార్యక్రమం విజయ వంతం చేయాలని ధర్మకర్త ఉప్పాడ కృష్ణ తదితరులు కోరారు.
కలశాలతో ఊరేగింపు
శ్రీకాకుళం కల్చరల్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బొందిలీపురం షిర్డీ దర్బార్‌లో గురుపౌర్ణమి ఉత్స వాలు నిర్వహిస్తున్నారు. బుధవారం మహిళలు 108 కలశాలతో నాగావళి నదీ తీరాన ఉన్న నాగే శ్వర ఆలయంలో శివుడికి, షిర్డీసాయికి మూల విరాట్‌కు జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమం లో పలువురు భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:43 PM