టిడ్కో గృహాలపై త్వరలో మార్గదర్శకాలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:46 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయని కమిషనర్ ఎన్.రామారావు తెలిపారు.
పలాస, జూలై 7(ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో నిర్మించిన టిడ్కో గృహాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయని కమిషనర్ ఎన్.రామారావు తెలిపారు. సోమవారం పలాసలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మునిసిపాలిటి పరిధిలో పలు వురు టిడ్కో గృహాలపై ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ గృహాలు లేక పోయినా బ్యాంకుల నుంచి వడ్డీల కోసం ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయని తెలి పారు. నిర్మించి ఏడేళ్లైనా ఎందుకు తమకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. గ్రీవెన్స్‌లో మొత్తం13 దరఖాస్తులు వచ్చాయి. కాగా మునిసిపాలిటీలోని తొమ్మిదిమంది కార్య దర్శులకు ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, రాజాం పురపాలకసంఘాలకు బదిలీకావడంతో వారికి రిలీవింగ్ ఉత్తర్వులను కమిషనర్ రామారావు అందించారు.
Updated Date - Jul 07 , 2025 | 11:46 PM