‘బంగారుతల్లి’ కుటుంబాలకు మార్గదర్శకుల చేయూత
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:46 PM
పీ-4 సర్వేలో భాగంగా గుర్తించిన బంగారు తల్లి కుటుంబాలకు మార్గదర్శకులు చే యూతను అందించేలా చర్యలు తీసు కుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
గార, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పీ-4 సర్వేలో భాగంగా గుర్తించిన బంగారు తల్లి కుటుంబాలకు మార్గదర్శకులు చే యూతను అందించేలా చర్యలు తీసు కుంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం పి-4 సర్వేపై పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం గ్రామంలో బంగారు తల్లి కుటుంబాలను కలిసి వారితో మాట్లాడారు. ఇన్‌చార్జి ఎంపీడీవో ఐ.రఘు మాట్లాడుతూ.. మం డలంలోని పీ-4 సర్వేలో 2,743 మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, 175 మంది మార్గ దర్శకులుగా ముందుకు వచ్చారన్నారు. గారలో పీస మన్మథ రావు తన ఇంటి ముందు నిర్మించిన ఇంకుడు గుంతను కలెక్టర్ పరిశీలించి ఆయనను అభినందించారు. కార్యక్ర మంలో సర్పంచ్ మార్పు దుర్గాపృథ్వీరాజ్, మాజీ సర్పంచ్ బడగల వెంకటప్పారావు, తహసీల్దార్ చక్రవర్తి, పీ-4 సర్వే ప్రత్యేకాధికారులు డాక్టర్ పీటీ బాలకృష్ణ, నక్క రామకృష్ణ, ఇన్‌చార్జి డిప్యూటీ ఎంపీడీవో వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 11:46 PM