పచ్చదనమే లక్ష్యం కావాలి: కలెక్టర్
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:01 AM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాను పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించా రు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాను పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్క లు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వ హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా, మం డల స్థాయి అధికారులతో మాట్లాడారు. మొక్కల సంఖ్య, వాటి లభ్యతను ఖచ్చితంగా అంచనా వే యాలని, ట్రీ గార్డులు సిద్ధం చేయాలని, సోక్ పిట్స్, కంపోస్టు పిట్స్ పూర్తి చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, జూనియర్ రెడ్‌క్రాస్, వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యో గా దినోత్సవానికి సంబంధించి యోగాంధ్ర ప్రచారం కోసం ముందస్తు సన్నాహాలను వేగ వంతం చేయాలన్నారు. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్లి పెట్టాలన్నారు. సమీక్షలో జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా, సీపీవో ప్రసన్నలక్ష్మి, వ్యవ సాయాధికారి త్రినాథస్వామి, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, హౌసింగ్ పీడీ నగేష్, ఏపీఈపీ డీసీఎల్ ఎస్‌ఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:01 AM