ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:37 PM

మహిళాభివృద్ధికి ప్రభు త్వం అనేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మహిళాభివృద్ధికి ప్రభు త్వం అనేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్మించిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ కలెక్షన్‌ సెంటర్‌ (ఎఫ్‌పీవో) భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతు ఉత్పత్తి కేంద్రాల ద్వారా వారు పండించే పంటలను కొనుగోలు చేస్తే రైతుకు ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. సమావేశంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పుచ్చ ఈశ్వర రావు, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, డీటీ మురళీకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, మండల మహి ళా సమాఖ్య అధ్యక్షురాలు బర్ల సుజాత, ఏపీఎం ప్రసాదరావు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శశిభూషణ్‌, నాయకులు కర్ని రమణ, ఎ.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:37 PM