ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:21 AM

విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ అన్నారు.

మొదటి ర్యాంకర్‌ చల్లా ప్రీతికి బ్రాంచ్‌ కేటాయింపు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న క్యాంపస్‌ డైరెక్టర్‌ బాలాజీ
  • ఆర్జేయూకేటీ డైరెక్టర్‌ బాలాజీ

ఎచ్చెర్ల, జూలై 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ అన్నారు. రాజీవ్‌గాంధీ యూనివర్సి టీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం క్యాంపస్‌ లో పీయూసీ పూర్తి చేసిన విద్యా ర్థులకు ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లను బుధవారం కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో పోటీ తత్వంతో చదివాలన్నారు. ఈ క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌లో అన్ని విభాగాల్లో కలిపి 1,020 సీట్లు ఉన్నాయని, మొదటి ఐదు ర్యాంకులు బాలికలు కైవసం చేసుకున్నారన్నారు. మొదటి ర్యాంకర్‌ చల్లా ప్రీతి ఈఈఈ, రెండో ర్యాంకర్‌ బి.నిఖిల ఎలకా్ట్రనిక్స్‌, మూడో ర్యాంకర్‌ పి.సింధు, నాలుగో ర్యాంకర్‌ ఎ.నందిని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, ఐదో ర్యాంకర్‌ కె.లక్ష్మి మాధురి కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏవో డాక్టర్‌ ముని రామకృష్ణ, డీన్‌ డాక్టర్‌ శివరామకృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, డీన్‌ వెల్ఫేర్‌ జి.రవి, మోహన కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:21 AM