మోదీతోనే దేశంలో సుపరిపాలన
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:12 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే దేశంలో సు పరిపాలన సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్) అన్నారు.
జి.సిగడాం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే దేశంలో సు పరిపాలన సాధ్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్) అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలో బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు పైల విష్ణుమూర్తి ఆధ్వర్యం లో నిర్వహించిన వికసిత భారత సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 11ఏళ్లలో భారతదేశ దశ, దిశ వైభవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా 11ఏళ్ల ప్రయాణం విజయవంతంగా సాగిందన్నారు. ముందగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు వజ్జపర్తి రఘురాం, బూరాడ వెంకటరమణ, కుమరాపు రవికుమార్, టంకాల మౌళీశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, సీనియర్ నాయకుడు పైడి వేణుగోపాలరావు, సంపతిరావు నాగేశ్వరరావు, గొర్లె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:12 PM