కూరగాయలు విక్రయించేందుకు వెళ్తూ..
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:35 PM
కూరగాయల విక్రయానికి వెళ్తూ బుధవారం తెల్లవారు జాము న తర్లిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాల య్యాయి.
టెక్కలి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): కూరగాయల విక్రయానికి వెళ్తూ బుధవారం తెల్లవారు జాము న తర్లిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి. కోటబొమ్మాళి మండలం తర్లి పటకు చెందిన బుడత రత్నాలమ్మ (36), భర్త లోకనాథం ట్రాలీ రిక్షాపై కూరగాయలు తీసుకు వెళుతున్నారు. ఆ సమయంలో టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ట్రాలీ రిక్షాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ రిక్షాపై వెళుతున్న ఇద్దరికీ తీవ్రగాయాల య్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ రత్నాలమ్మ మృతి చెందింది. తీవ్ర గాయాలైన లోకనాథంను మెరుగైన చికిత్స నిమి త్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ సత్యనారా యణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
రణస్థలం, జూన్ 25(ఆంధ్రజ్యోతి): పైడిభీమ వరంలోని ఓ లాడ్జిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎంఆర్ సందీప్ (24) ఉరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జేఆర్ పురం పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. సందీప్ స్థానిక ఒక రసాయనిక పరిశ్రమలో కాంట్రాక్టర్ వద్ద విధులు పనిచేస్తున్నాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఆ లాడ్జీలో ఉంటు న్నాడు. అయితే రెండు రోజు లుగా సందీప్ ఫోన్ లిఫ్ట్ చేయక పోవడంతో సంబంధి కాంట్రాక్టర్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. దీంతో సందీప్ ఉంటున్న లాడ్జీను బుధవారం తోటి కార్మికులు పరిశీలించగా బాత్ రూమ్‌లో సందీప్ ఉరి వేసుకుని విగతజీవిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వ జన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jun 25 , 2025 | 11:35 PM