ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొలానికి వెళ్లి.. విగతజీవిగా మారి

ABN, Publish Date - Jul 24 , 2025 | 12:22 AM

మం డలంలోని దుప్పిలపాడు గ్రామానికి చెందిన డొక్కరి వీరాస్వామి (42) అనే కౌలు రైతు బుధ వారం పిడుగు పడి మృతి చెందాడు.

వీరాస్వామి మృతదేహం

- పిడుగు పడి కౌలు రైతు మృతి

కోటబొమ్మాళి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని దుప్పిలపాడు గ్రామానికి చెందిన డొక్కరి వీరాస్వామి (42) అనే కౌలు రైతు బుధ వారం పిడుగు పడి మృతి చెందాడు. వీరాస్వా మి పొలంలో పని చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై పిడుగుపడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వీరాస్వామికి భార్య శాంతి, కుమారు డు జశ్వంత్‌, కుమార్తె జోత్న ఉన్నారు. వీరా స్వామి స్వగ్రామం సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు. కొన్నేళ కిందట అత్తవారి ఊరు దుప్పిలపాడుకు ఇల్లారికం వచ్చాడు. సుమారు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని భార్య శాంతితో కలిసి సాగుచేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. వీరాస్వామి మృతితో భార్యాపిల్లలు కన్నీరుము న్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక వీఆర్వో పేడాడ అకిల్‌ శవ పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం కోసం వీరాస్వామి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.

Updated Date - Jul 24 , 2025 | 12:22 AM