ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Irrigation Projects: సాగునీటి కల సాకారం

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:15 AM

Water Resources ఉత్తరాంధ్రలో సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, సాగునీటి కల సాకారం చేస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో మాట్లాడుతున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పక్కన మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు
  • శివారు ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం

  • జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

  • వంశధార ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఆదేశం

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో సాగునీటి భవితవ్యాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, సాగునీటి కల సాకారం చేస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి శివారుభూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. నేరడి సైడ్‌వీయర్‌ వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించి ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌కు నిరంతరాయంగా నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 88వ ప్యాకేజీలో 90 శాతం పనులు పూర్తయినా.. భూసేకరణలో జాప్యం, పరిహారం చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను ఆలస్యం చేస్తున్న ఏజెన్సీలకు తక్షణమే నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ పనులు నెమ్మదిగా సాగుతుండటంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొట్టా ఎత్తిపోతల పథకం పూర్తయితే 12 టీఎంసీల నీరు హిరమండలం రిజర్వాయర్‌కు తరలించవచ్చని.. ఇది కీలకమైన ప్రాజెక్టు అని తెలిపారు. గొట్టాబ్యారేజీ ఆప్రాన్‌ పనుల కోసం రూ.12.81 కోట్ల టెండర్లను వెంటనే పిలవాలని ఆదేశించారు.

  • అధికారులు మాట్లాడుతూ.. ‘రూ. 145కోట్ల విలువైన పనుల్లో రూ.22కోట్ల పనులు పూర్తయ్యాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వంశధార ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యం 2480 క్యూసెక్కులు అయినా, ప్రస్తుతం 1800 క్యూసెక్కుల నీరు మాత్రమే అందుతోంది. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంద’ని తెలిపారు.

  • వంశధార ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి..

  • ‘వంశధార ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఒడిశాతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. హిరమండలం రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యానికి నింపేందుకు చర్యలు తీసుకుంటాం. గొట్టాబ్యారేజీ ఆధునికీకరణ పనులు త్వరలో ప్రారంభిస్తాం. మదన గోపాలసాగరం, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తాం. వంశధార-నాగావళి నదుల అనుసంధాన పనులను వేగవంతం చేస్తాం. జిల్లాలో నేరడి బ్యారేజీ అంశం... అంతరాష్ట్ర జలవివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూనే.. ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రాజెక్టులో నీటిని పుష్కలంగా నీటిని నింపే ఏర్పాట్లు చేపడుతున్నామ’ని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.

  • షట్టర్ల కుంభకోణంపై చర్చ

  • వంశధార కాలువల షట్టర్ల కుంభకోణంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోర్టు అనుమతి పొంది వెంటనే షట్టర్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల్లోని 108 గ్రామాలకు సాగునీరు అందుతుందని.. ఇప్పటివరకు 45 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. భూసేకరణ సమస్యల పరిష్కారానికి స్థానికులతో చర్చలు జరుగుతున్నాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వివరించారు.

  • నాగావళి - వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కోరారు. రణస్థలం మండలం పైడిభీమవరం పారిశ్రామిక వాడకు సాగునీటి ప్రాజెక్టుల నుంచి నిరంతరాయంగా నీటి సరఫరా ఉండేలా చొరవ చూపాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు కోరారు. కళింగపట్నం, అంబళ్లవలస ఎత్తిపోతల పథకాల పనులు పూర్తిచేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మంత్రిని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ నార్త్‌ కోస్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రామ్‌గోపాల్‌, డీఆర్వో వెంకటేశ్వరరావు, జిల్లా జలవనరుల శాఖ ఈఈ పి సుధాకరరావు, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ తిరుపతిరావు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:15 AM