ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య రక్షణకు.. ఓఆర్‌ఎస్‌!

ABN, Publish Date - Jul 29 , 2025 | 12:10 AM

health protection dehydration prevention మన శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. తద్వారా అవయవాలు సరిగా పనిచేయక అనారోగ్యం బారిన పడతాం. అలాగే అతిసారం వల్ల వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహ్రైడేషన్‌తో ద్రవాలు కోల్పోయి మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి మరణాలను తగ్గించేందుకు, ఆరోగ్యానికి రక్షణ కల్పించేందుకు ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్స్‌) సంజీవనిలా పనిచేస్తుంది.

  • అతిసారం నుంచి కాపాడుతుంది

  • శరీరంలో నీటి శాతం పెంపునకు దోహదం

  • నేడు ప్రపంచ ఓఆర్‌ఎస్‌ దినోత్సవం

  • నరసన్నపేట, జూలై 28(ఆంధ్రజ్యోతి): మన శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. తద్వారా అవయవాలు సరిగా పనిచేయక అనారోగ్యం బారిన పడతాం. అలాగే అతిసారం వల్ల వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహ్రైడేషన్‌తో ద్రవాలు కోల్పోయి మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి మరణాలను తగ్గించేందుకు, ఆరోగ్యానికి రక్షణ కల్పించేందుకు ఓఆర్‌ఎస్‌ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్స్‌) సంజీవనిలా పనిచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆదేశాల మేరకు ఓఆర్‌ఎస్‌పై అవగాహన పెంచేందుకు ఏటా జూలై 29న ప్రపంచ ఓఆర్‌ఎస్‌ దినోత్సతాన్ని నిర్వహిస్తున్నారు. ఇంట్లో తక్కువ ఖర్చుతోనే ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తయారుచేసుకోవచ్చని, దీనిద్వారా శరీరంలో నీటిశాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

  • ప్రాముఖ్యత ఇదే..

  • ఓఆర్‌ఎస్‌ అనేది చక్కెర, ఉప్పు, నీరు కలిసిన మిశ్రమం. ఇది డీహైడ్రేషన్‌ బారి నుంచి కాపాడుతుంది. శిశువుల ఆరోగ్యం, వారి శ్రేయస్సుకి అమృతంలా పనిచేస్తుంది. పిల్లల మరణాలు తగ్గించడం, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది. 1960 తర్వాత ఓఆర్‌ఎస్‌ ప్రాముఖ్యతను యూనిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు అతిసారం సంబంధిత వ్యాధులే కారణం. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 1.7 బిలియన్ల మంది పిల్లలను అతిసారం ప్రభావితం చేస్తోంది. డయేరియా కారణంగా డీహైడ్రేషన్‌తో ఏటా 5.25లక్షల మంది చిన్నారులు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే.. డీహైడ్రేషన్‌ను నిరోధిస్తుంది. రెండేళ్లలోపు చిన్నారులకు 50 -100 ఎం.ఎల్‌, రెండు నుంచి పదేళ్లలోపు పిల్లలకు 100 - 200 ఎం.ఎల్‌, పెద్దలకు తగు పరిమాణంలో ఓఆర్‌ఎస్‌ తీసుకోవచ్చని వైద్యనిపుణులు సూచించారు. వేసవిలో ఎండల తీవ్రత నుంచి ఓఆర్‌ఎస్‌ ఎంతో ఉపశమనం ఇస్తుందని స్పష్టం చేశారు. డీహైడ్రేషన్‌తో ప్రమాదాలు, ఓఆర్‌ఎస్‌ వినియోగంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు.

  • అతిసారం నుంచి విముక్తి

  • చిన్నపిల్లలకు అతిసారం నుంచి విముక్తి కల్పించడంలో ఓఆర్‌ఎస్‌ అమృతంలా పనిచేస్తుంది. డాక్టర్ల సలహాపై తల్లిదండ్రులు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని పిల్లలకు ఇవ్వాలి. ఇది శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. పిల్లలకు, పెద్దల ఆరోగ్యానికి ఓఆర్‌ఎస్‌ దోహదపడుతుంది.

  • - మెండ సుధారాణి, చిన్నపిల్లల వైద్యనిపుణులు, ప్రభుత్వ ఆస్పత్రి, నరసన్నపేట

  • నీటిశాతం పెంచుతుంది

  • శరీరంలో నీటి శాతం పెంచడంలో ఓఆర్‌ఎస్‌ దోహదపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఓఆర్‌ఎస్‌ తీసుకోవచ్చు. షుగర్‌, బీపీ పేషెంట్లు వైద్యుల సూచనలు పాటించాలి.

    - డా.సీపాన శ్రీనివాసబాబు, సూపరింటెండెంట్‌, వంద పడకల ఆస్పత్రి, నరసన్నపేట

Updated Date - Jul 29 , 2025 | 12:10 AM