క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించండి
ABN, Publish Date - May 21 , 2025 | 12:05 AM
క్వారీ నిర్వహణలో తప్పనిసరిగా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ముద్దాడ, కొంగరాం పంచాయతీల్లోని క్వారీలను పరిశీలించారు.
ఎచ్చెర్ల, మే 20(ఆంధ్రజ్యోతి): క్వారీ నిర్వహణలో తప్పనిసరిగా నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ముద్దాడ, కొంగరాం పంచాయతీల్లోని క్వారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేకపోవ డంతో ఈ రెండు క్వారీలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నా రని చెప్పారు. అవసరమైన అన్ని నిబంధనలు పాటిస్తేనే అనుమతిస్తామన్నారు. క్వారీ విస్తీర్ణం, గతంలో ఏ మేరకు తవ్వకాలు జరిగాయి, ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశాలను పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్ బి.గోపాల్, ఎస్‌ఐ ఎస్.సందీప్‌కుమార్ ఉన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:05 AM