పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలి: డీఎల్‌పీవో
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:38 PM
: వర్షాకాలం కావడంతో పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ సూచించారు.బుధవారం కోటబొమ్మాళి మండల పరిషత్ సమావేశం మందిరంలో ఏ ఎన్‌ఎంలు, ఇంజినీరింగ్ సహాయకులు, పంచా యతీ కార్యదర్శులతో సమీక్షించారు.
కోటబొమ్మాళి, జూలై 9 ( ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం కావడంతో పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని టెక్కలి డీఎల్‌పీవో ఐవీ రమణ సూచించారు.బుధవారం కోటబొమ్మాళి మండల పరిషత్ సమావేశం మందిరంలో ఏ ఎన్‌ఎంలు, ఇంజినీరింగ్ సహాయకులు, పంచా యతీ కార్యదర్శులతో సమీక్షించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది క్లోరినేషన్ ఎప్పటికప్పుడు చేయాలని తెలిపారు. తాగునీటి విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వాటర్ ట్యాంకులు శుభ్రం చేయించే బాధ్యత తీసుకో వాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో జె.ఆనందరావు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:38 PM