త్వరలో ఫ్లైఓవర్ పనుల ప్రారంభం
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:01 AM
: కాశీబుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.48 కోట్లు కేటాయించడంతో పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
పలాస, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.48 కోట్లు కేటాయించడంతో పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని 27వవార్డు భద్రమ్మకోనేరు వద్ద రూ.27 లక్షలతో నిర్మిం చనున్న ప్రహరీకి భూమిపూజచేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే తాగు నీటి కోసం రూ.63 లక్షలు కేటాయించగా పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలి పారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు అదనంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఎన్.రామారావు,ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, మునిసిపల్ చైర్మన్ బళ్లగిరిబాబు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌గుప్తా, సప్ప నవీన్, దడియాల నర్సింహులు, ఎం.నరేంద్ర(చిన్ని), ఎ.రామ కృష్ణ, కొత ్త సత్యం పాల్గొన్నారు.
నువ్వలరేవులో శాంతి హోమం
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నువ్వలరేవులో బృందావతిమాత ఆలయ సన్నిధిలో శుక్రవారం శాంతిహోమం నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న హోమం 24 గంటలపాటు చేపడుతున్నామని సర్పంచ్ మువ్వల పూర్ణ చెప్పారు. శాంతిహోమం నిర్వహిస్తే ఆటంకాలు తొలగి శుభాలు కలుగుతాయని గ్రామస్థుల నమ్మకం. ప్రతి ఇంటిముందు కలశంపై కొబ్బరికాయను ఉంచి పూజలు నిర్వహించారు. మహిళలు పసుపునీటితో ఉన్న కలశం తీసుకువెళ్లి అభిషేకాలు చేయించారు. ఎమ్మెల్యే గౌతుశిరీష శాంతి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆనంద్, వెంకటేష్, వెంకటరమణ,నీలాంబర్ పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:01 AM