central minister: మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం
ABN, Publish Date - May 03 , 2025 | 11:39 PM
Fishermen Development మత్స్యకార గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సోంపేట మండలంలో మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొండిరేవు, ఉప్పుటేరు వంతెనల నిర్మాణాకి.. ప్రభుత్వవిప్ బెందాళం అశోక్‌తో కలిసి శనివారం కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
ఉప్పుటేరు, కొండిరేవు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన
సోంపేట, మే 3(ఆంధ్రజ్యోతి): మత్స్యకార గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. సోంపేట మండలంలో మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొండిరేవు, ఉప్పుటేరు వంతెనల నిర్మాణాకి.. ప్రభుత్వవిప్ బెందాళం అశోక్‌తో కలిసి శనివారం కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రూ.18.10కోట్ల వ్యయంతో బారువ వద్ద మహేంద్రతనయ నదిపై కొండిరేవు వంతెన, ఎకువూరు ప్రాంతంలో ఉప్పుటేరు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం బారువ సముద్ర తీరంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బీచ్‌ఫెస్టివల్ కార్యక్రమంలో స్టాల్స్ పరిశీలించారు. తీరంలో పలు కార్యక్రమాలను, స్పీడ్ బోట్ గేమ్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మానా అహ్మద్‌ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్, ఆర్డీవోలు, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, సూరాడ చంద్రమోహన్, చిత్రాడ శ్రీనివాసరావు, మడ్డుకుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:39 PM